ముగిసిన అఖిలపక్ష సమావేశం

ఏపీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తొమ్మిది అంశాలను వైసిపి తరుపున లేవనెత్తాము.

రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన 18, 969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని అడిగాం.

వెనకబడిన జిల్లాలకు 23 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరాం.

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన
3,283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలని ఆడిగాం.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను ఆమోదించాలని కోరాం.

క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రూ. 47,424 కోట్లు ఇవ్వాలని సమావేశంలో ప్రస్తావించాం.

దుగ్గరాజపట్నం పోర్ట్ కి బదులు గా రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరాం.

ఏపీ రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని అడిగాం.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసాం.
మొదటి నుంచి మేము కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం.

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు విడుదల చేయాలని అడిగాం.

మండలి రద్దు విషయంప్రభుత్వానికి వచ్చింది.. దానిని ఫాలో అప్ చేసే బాధ్యత మా పై ఉంది.