ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పుష్పక విమానం

ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పుష్పక విమానం

దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలతో పేరుతెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఈసారి కామెడీ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను ఆనంద్ సోదరుడు, అగ్రహీరో విజయ్ దేవరకొండ ఇవాళ రిలీజ్ చేశాడు. దామోదర అట్టాడ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి పుష్పక విమానం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.కింగ్ ఆఫ్ ద హిల్, టాండా ప్రొడక్షన్స్ బ్యానర్లపై విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి, గోవర్ధన్ రావ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుష్పక విమానం చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన శాన్వీ మేఘన, గీతా సైనీ కథానాయికలు. సీనియర్ నటుడు సురేశ్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాకు రామ్ మిరియాల, అమిత్ దాసాని, సిద్ధార్థ్ సదాశివుని సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.