నెటిజెన్ కు అనసూయ కౌంటర్

నెటిజెన్ కు అనసూయ కౌంటర్

సినీ నటి, బుల్లి తెర హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలు, తన అభిప్రాయాలు, తన సినిమాల వివరాలు తదితర అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది. తాజాగా ఒక ఫొటోను ఆమె షేర్ చేసింది. దీనిపై ఒక నెటిజెన్ ఓ మీమ్ క్రియేట్ చేశాడు. నువ్వేమైనా సమంత అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ‘అయ్యో లేదమ్మా… నన్ను అనసూయ అంటారు’ అని సమాధానం ఇచ్చింది.అనసూయ రెస్పాన్స్ పై సదరు నెటిజెన్ స్పందిస్తూ… క్షమించండి మేడమ్, ఆటపట్టించడం కోసమే సరదాగా అన్నానని చెప్పాడు. అయినా అనసూయ శాంతించలేదు. నువ్వు మానసికంగా ఇంకా చిన్నపిల్లాడివే అని తనకు అర్థమయిందని… నువ్వు త్వరగా ఎదగాలని కోరుకుంటున్నానని కౌంటర్ ఇచ్చింది. నెటిజెన్లపై అనసూయ ఇలా ఫైర్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలు సందర్భాలలో చాలా మందికి కౌంటర్ ఇచ్చింది.