మమ్ముట్టి సినిమా కు అనసూయ గ్రీన్ సిగ్నల్

మమ్ముట్టి సినిమా కు అనసూయ గ్రీన్ సిగ్నల్

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకుని, ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న అనసూయ.. తదనంతర కాలంలో వెండితెరపై కూడా తనదైన ముద్ర వేసింది. తన మనసుకు నచ్చిన.. ప్రాధాన్యత వున్న పాత్రలను పోషిస్తూ సినిమాలలో కూడా రాణిస్తోంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా నటించే ఓ తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పి, కోలీవుడ్ ప్రవేశం కూడా చేసింది. ఇంకా తన సినీ ప్రయాణాన్ని ఇతర చిత్రరంగాలలో కూడా కొనసాగించాలని ఈ చిన్నది నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తాజాగా మలయాళ చిత్రరంగ ప్రవేశం కూడా చేయడానికి సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మమ్ముట్టి నటించే ఓ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో మమ్ముట్టి తెలుగులో నటించిన ‘యాత్ర’ సినిమాలో అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే.