ఢిల్లీలోని AP/TS భవన్ సాయి క్యాంటీన్ మూసివేత

ఢిల్లీలోని AP/TS భవన్ సాయి క్యాంటీన్ మూసివేత

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్తగా
ఏపీ/టీఎస్ భవన్ లోని సాయి కేటరర్స్ క్యాంటీన్
మార్చి31 వరకు తాత్కాలికంగా మూసివేసారు.

కరోనా వైరస్ నివారించేందుకు ప్రజల సహాయార్ధం ఏపీ
భవనులో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా.

కరోనాతో e కామర్స్ డిస్కౌంట్ కౌంట్ డౌన్

ప్రపంచ దేశాలన్నింటిని కోవిడ్19 వణికిస్తుండటంతో
ఈ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఏపీ/తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లు సంయుక్తంగా AP/TS భవన్ ప్రాంగణంలోన్న సాయి కేటరర్స్ క్యాంటీన్ తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి మార్చి 31వ తేదీ మంగళవారం వరకు సాయి కేటరర్స్ క్యాంటీన్ మూసివేయనున్నారు.

కాలన్నీ వృధా చేయరాదు. అలాగే కరోనా కట్టడికి మనం ఏం చేయాలి?

ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ క్యాంటీన్ లో భోజనం కోసం వచ్చే స్థానిక ప్రజలు, పర్యాటకులకు కరోనా సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవనులకు అనుబంధంగా వున్న అతిధి గృహాలలో బస చేస్తున్న వాళ్లందరికీ మాత్రం అల్పాహారం, భోజన వసతిని రూములకే పార్సల్ ఇవ్వడం జరుగుతోంది. ఉభయ
భవనాల ప్రాంగణాల్లోని క్వార్టర్స్ లో నివసిస్తోన్న
ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యులు, వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి వచ్చి AP/TS భవన్ అతిధి గృహాల్లో విడిది చేస్తున్న అధికారులకు కరోనా సోకకుండా పరిశుభ్రత కోసం జాగ్రత్తలు
తీసుకుంటున్నారు.

క‌రోనా తెచ్చిన క‌ష్టాలు విదేశాల నుంచి వ‌చ్చే వారికి త‌ప్ప‌ని తిప్ప‌లు