AP సరిహద్దులు బంద్

AP సరిహద్దులు బంద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసి వేస్తు నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలు వాహనాలను అనుమతించడం లేదు. రాత్రి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నామని ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఉదయం నుండి జిల్లాల మధ్య రాకపోకలను కూడా అనుమతిచడం లేదు. అత్యవసర సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు మూసివేత కారణంగా ప్రజలు ఎవరు రాకపోకలు కొనసాగించారాదని ప్రజలకు DGP విజ్ఞప్తి చేసారు.