కరోనా యుద్ధ పోరాట యోధులకు సలాం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రాష్ట్రంలో కోవిడ్‌-19 వ్యాప్తి, నివారణా చర్యలపై జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆసుపత్రుల వైద్యులతో క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కరోనా యుద్ధంలో పోరాడుతున్న వైద్యుల సేవలను ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి ప్రశంసించారు ప్రాణాలను లెక్క చేయకుండా సర్వీసు చేయడంపై వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా అభినందించారు.

రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందిస్తున్నారని గుర్తించాము. ప్రతి
జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే క్రిటికల్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ కూడా చాలా కష్టపడి ఈ సేవ చేస్తున్నారు. కనబడని శత్రువుతో తెలియని భయంతో ఉన్నప్పటికీ కూడా మీరు వైద్య సేవలు అందిస్తున్నందుకు నేను సెల్యూట్‌ చేస్తున్నాను. ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన వ్యక్తుల కారణంగా కేసులు సంఖ్య పెరిగింది. పూర్తిగా వారందర్నీ కనుగొని వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను, సెకండరీ కాంటాక్ట్స్‌ను పూర్తి క్వారంటైన్‌ లేదా? ఐసోలేషన్‌లో పెడుతున్నాము. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నాను.

ఈ సమీక్షలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

క్వారంటైన్, ఐసోలేషన్‌ గదుల్లో సదుపాయాలు:

క్వారంటైన్, ఐసోలేషన్‌ గదుల్లో సదుపాయాలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష చేసారు. ఐసోలేషన్‌లో పెట్టేవారికి మంచి సదుపాయాలు ఉన్న గదులు ఇవ్వాలని స్పష్టంచేసిన సీఎం
అక్కడ సౌకర్యాలు, సదుపాయలు ఉండేలా అధికారులు దృష్టిసారించాలన్నారు. జలుబు, గొంతునొప్పి, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో ఉన్నవారి అందరికీ కూడా పరీక్షలు చేయించాలని మరోసారి స్పష్టంచేసారు.

వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అంశాలపై సీఎం సమీక్ష.

అకాల వర్షాల కారణంగా కడప, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం CM చెల్లించాలన్నారు. అలాగే పిడుగుపాటుకు, బోటు ప్రమాదంలో మరణించిన
వారికి 24 గంటల్లోగా ఎక్స్‌గ్రేషియా అందించాలని సంబంధిత కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని తెలిపారు. రవాణాను పెంచడానికి సంబంధిత అసోసియేషన్లతో మాట్లాడుతున్నామని అధికారుల వెల్లడి
మొక్కజొన్న, శెనగ, కందులు, జొన్నలు, పసుపు లాంటి పంటలకు మార్కెటింగ్, ధరల పరంగా రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. పౌల్ట్రీ సెక్టార్‌తో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు చేసేలా చూడాలన్న సీఎం
తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ యాప్‌ను సీఎంకు వివరించిన అధికారులు.

గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు తప్పనిసరిగా తమతమ గ్రామాల్లోని పంటలు, వాటి ధరలపై ఎప్పటికప్పుడు యాప్‌ద్వారా తెలియజేసేలా చూడాలన్న సీఎం
యాప్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా చర్యలు వెనువెంటనే తీసుకునేలా వ్యవస్థ సన్నద్ధతతో ఉండాలన్న సీఎం
రొయ్యలు, చేపల ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునే అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.