ఏపీలో ఎంసెట్‌/ఈసెట్‌ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 24న ఈసెట్‌ అలాగే జూలై 25న ఐసెట్‌ పరీక్ష జరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయం.
జూలై 27 -31 వరకు ఎంసెట్ పరీక్షలు
ఈసెట్ జూలై 24, ఐసెట్ జూలై 25, పీజీ సెట్ ఆగస్టు 2 నుంచి 4 వరకు, ఎడ్ సెట్ ఆగస్టు 5, లా సెట్ ఆగస్ట్ 6, ఈసెట్ ఆగస్ట్ 7 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు చైర్మన్ ప్రొఫెసర్ హేమ చంద్రారెడ్డి.

లాక్ డౌన్ నేపథ్యంలో ఎంసెట్ తో పాటు, లా సెట్, ఐ సెట్, ఎడ్ సెట్,పీజీ సెట్,ఈ సెట్ లకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వరకు అవకాశం.. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. హేమచంద్ర రెడ్డి తెలిపారు.

ఇప్పటి వరకు ఎంసెట్ పరీక్షలకు 1,69,137 ఇంజినీరింగ్ కు , 78959 మెడికల్ కు ఆన్ లైన్ లో ధరఖాస్తూ చేసుకున్నారు.