APEC నియామకంపై భిన్నస్వరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో జస్టీస్ V. కనగ రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ MP విజయసాయి రెడ్డి కలిసి అభినందనలు కూడా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి.

ఆ ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని
ఎస్‌ఈసీ తొలగింపుపై గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాసారు.
ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగి ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకొచ్చిందని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన రాజ్యాంగ పదవిలో ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నియమించడం, కరోనాపై పోరాట సమయంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నారని AP BJP ప్రశ్నిస్తోంది. ఈ నిర్ణయంపై కమలాధ్యుక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, విజయవాడ LOKSABHA ఇంఛార్జ్ కిలారి దిలీప్ తీవ్రంగా ఖండించారు.