APలో జనతా కర్ఫ్యూ ఫోటోలు..

 

విశాఖపట్నం జనతా కర్ఫ్యూ

కాకినాడ జనతా కర్ఫ్యూ

 

క‌ర్నూలులో వైర‌స్‌లు రాకుండా కృషి చేస్తున్నాం: టి.జి భ‌ర‌త్‌

క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ లాంటి భ‌యంక‌ర‌మైన వైర‌స్‌లు రాకుండా త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు టిజివి గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్, టిజిబి యూత్ అధ్య‌క్షుడు టి.జి భ‌ర‌త్ అన్నారు. శ‌నివారం టిజివి సంస్థ‌ల ద్వారా త‌యారైన హైపో ద్రావ‌ణాన్ని ఉచితంగా క‌ర్నూలు ప్ర‌జ‌లు అందించే కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న మౌర్య ఇన్‌లో ప్రారంభించారు. హైపో ద్రావ‌ణాన్ని ట్యాంక‌ర్లు, డ్ర‌మ్ముల ద్వారా క‌ర్నూలు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు వీధులు తిరుగుతూ స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుత‌ము ప్ర‌భ‌లిస్తున్న కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకొని టి.జి.వి సంస్థ హైపో ద్రావ‌ణాన్ని క‌ర్నూలు వాసుల‌కు ఉచితంగా స‌ర‌ఫ‌రా చేసేందుకు నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. 1 లీట‌రు ఈ ద్రావ‌ణ‌మును 20 లీట‌ర్ల నీటిలో (1;20) క‌లిపిన మిశ్ర‌మాన్ని గృహాలు, బాత్రూములు, వంట గ‌దులు, ఫ్లోర్‌, డోర్ హ్యాండిల్స్‌, డైనింగ్ టేబుల్స్‌, స్విచ్ బోర్డులు శానిటైజ్ చేయుట‌కు ఉప‌యోగించాల‌న్నారు. రోజు వారీగా ఎలాగైతే లైజాల్, ఫినాయిల్‌, డెటాల్‌ను ఉప‌యోగిస్తున్నారో వాటికి బ‌దులుగా అంత‌క‌న్నా శ‌క్తివంత‌మైన ఈ హైపో ద్రావ‌ణాన్ని అదేవిధంగా ఉప‌యోగించాల‌న్నారు. దీన్ని వాడ‌టం వ‌ల్ల క‌ర్నూల్లో ఎలాంటి వైర‌స్ లేకుండా పోతుంద‌న్నారు. ఒక‌వేళ వైర‌స్ ఉంటే క‌చ్చితంగా ఈ హైపో ద్రావ‌ణం వాడ‌టం వ‌ల్ల చ‌నిపోతుంద‌న్నారు. క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు విజ‌య‌వంతంగా స‌ర‌ఫ‌రా చేసిన అనంత‌రం దీన్ని ఇత‌ర ప్రాంతాల‌కు సైతం అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

విజయవాడ నగరంలో జనతా కర్ఫ్యూ