ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా మరణం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విజయవాడకు చెందిన 55ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌ కారణంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. మార్చి 30న ఉదయం 11.30గంటలకు వైద్యం కోసం ఆసుపత్రికి రావడం ఓ గంట తర్వాత 12.30గంటలకు అనుకోకుండా అతను చనిపోయాడని ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన వ్యక్తి కుమారుడి నుంచి కరోనా వైరస్‌ సోకిందని వైద్యులు భావిస్తున్నారు. అతనికి హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.