APEC vs APCS ఉత్తర ప్రత్యుత్తరాలు

APEC vs APCS ఉత్తర ప్రత్యుత్తరాలు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎస్ కు ఎస్ఈసీ ప్రత్యుత్తరం రాసారు. పూర్తి కారణాలతో సీఎస్ కు 3 పేజీల లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతంలో రాజ్ భవన్ లో కంటే ముందు ఆర్దిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశాను. ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉంది. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేశారు. ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని లేఖలో సూచించిన రమేష్ కుమార్.
గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ WHO హెచ్చరికలను, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పాటిస్తున్నమంటూ వివరించారు.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.