టాలీవుడ్ లో మరో బయోపిక్.. దాసరి జీవితం ఆధారంగా సినిమా

టాలీవుడ్ లో మరో బయోపిక్.. దాసరి జీవితం ఆధారంగా సినిమా

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో కూడా పలు బయోపిక్ లు తెరకెక్కాయి. ఎందరో ప్రముఖుల జీవితాలను దర్శకనిర్మాతలు తెరకెక్కించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, మహానటి, యాత్ర, మల్లేశం తదితర చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో లెజెండ్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు టాలీవుడ్ రెడీ అవుతోంది. దిగ్గజ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ధవళ సత్యం దర్శకత్వం మహించనున్నారు. ఇమేజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తాడివాక రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నటీనటులను ఎంపిక చేసే పని కొనసాగుతోంది. ఈ సినిమాకు ‘దర్శకరత్న’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించబోతున్నారు. 1947లో దాసరి నారాయణరావు జన్మించారు. 1972లో ‘తాత మనవడు’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరగా దర్శకత్వం వహించిన సినిమా ‘ఎర్ర బస్సు’. 2017లో అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు.