కరోనా లాక్ డౌన్ సమయంలో ఎందుకు బయటకు వెళ్లరాదని ప్రశ్నంచే వ్యక్తుల్లారా మీ సమాధానం చెప్పండి అంటూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ ఖాతాలో అడిగారు. కరోనా మహామ్మారి రోడ్లపై ఎలా సంచరిస్తుందో అందరికి అర్ధమయ్యే ఓ వైరస్ ఫోటోను చూపుతూ సమాధానం ఇవ్వండని కోరారు.
STAY HOME SAFE HOME, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కరోనా మహామ్మారి ఎమెర్జెన్సీ ఏంటో జనం అర్థం చేసుకోవాలని గవర్నర్ ఈ ట్వీట్ చేశారు.