అనుష్క నిశ్శబ్దం సినిమా అమెజాన్ లో రిలీజ్???

లాక్ డౌన్ పుణ్యమా దేశంలో చాలా పరిశ్రమలు దెబ్బైపోయాయి. అందులో సినీ పరిశ్రమ పరిస్థితి అయితే మరీ దారుణం. సినిమాలు తీసుకోలేక,తీసిన సినిమాలు విడుదల చేసుకోలేక,చేసిన చూసే నాధుడు లేక ఇలా ఒకటేమిటి అనేక ఇబ్బందుల్లో భారత చలనచిత్ర పరిశ్రమ ఉంది.

కొంతలో కొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ లతో నిర్మాతలు గట్టెక్కుతున్నారు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటిటి లకు బాగా అలవాటు పడ్డారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి సంస్థలు మీడియం రేంజ్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనుక్కొని థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేయాలని నిర్మాతల వెంటపడుతున్నాయి.

తాజాగా ఈ జాబితాలో అనుష్క -మాధవన్ కలిసి నటించిన నిశ్శబ్దం సినిమా కూడా చేరింది. నేరుగా డిజిటల్ రిలీజ్ చేసేందుకు ప్రైమ్ సిద్దమవుతున్నట్లు సమాచారం. నిర్మాతలు సైతం సై అంటున్నారట. అయితే అనుష్క ఒప్పుకుంటేనే సినిమా డైరెక్ట్ గా ప్రైమ్ లోకి రానుంది. మరి ఇందుకు అనుష్క ఓకే చెపుతుందో లేదో చూడాలి.