ఏపీ భవనులో 119వ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.

ఏపీ భవనులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.

ఆంధ్రప్రదేశ్ భవనులో సోమవారము ఉదయం 11 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో ఏపీ ప్రభుత్వం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 119వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, స్పెషల్ కమిషనర్ ఎం.వి.రమణారెడ్డి పలువురు అధికారులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత అమరజీవి చిత్రపటానికి ఘనంగా పూలమాలలు అర్పించారు.

ఈ కార్యక్రమంనకు ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు OSD రవిశంకర్, అసిస్టెంట్ కమిషనర్ MVS రామారావు, అకౌంట్స్ ఆఫీసర్ IV కృష్ణారావు, APO భారతీ ప్రసాద్, ఆడిటర్ బాబా, DER నాయక్, దేవేందర్, అసిస్టెంట్ PRO కె.గురవయ్య ,
వి. బాబు, ఉమారాణి, PRO ఎం. వి. రంగయ్య మరియు ఢిల్లీలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు ఏపీ భవనులోని అతిథులు, పర్యాటకులు
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.