ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ సురక్షితం

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ సురక్షితం
ఆంధ్ర ప్రదేశ్ భవనులో కరోనా వైరస్ వ్యాప్తి
నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించిన
ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అభయ్ త్రిపాఠి.

ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అభయ్ త్రిపాఠి, స్పెషల్ కమీషనర్, NV. రమణా రెడ్డి ఏపీ భవనులో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను బుధవారం పర్యవేక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఏపీ భవన్ లోని గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, శబరీ
బ్లాకులు, గవర్నర్ కాటేజ్, ఏపీ భవనులోని ఇతర కార్యాలయాలు, క్యాంటీన్,
ఉద్యోగులు నివాసముంటున్న పరిసరప్రాంతాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అభయ్ త్రిపాఠి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. కోవిడ్19 వైరస్ ప్రబలకుండా స్థానికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, తగిన సూచనలను ఇచ్చారు.

క్యాంటీనులోని భోజనశాలను, వంటశాలను సందర్శించి అందులోని పని చేస్తోన్న ఉద్యోగులకు తగిన సూచనలను వివరించారు. కరోనా అవగాహన కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయడానికి హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో ఆంధ్ర ప్రదేశ్ భవన్ నలుమూలల్లో పెట్టిన ప్రదర్శన బోర్డులను తిలకించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్లు MVS. రామారావు, సాయిబాబ, హౌస్ కీపింగ్ అధికారి కొండయ్యలు భవనులోని లిఫ్టులు, రైలింగులు, రూములు, టాయిలెట్లు మొదలైనవి ఎప్పటికప్పుడు శానిటైజర్స్ తో శుభ్రపరచడానికి ప్రత్యేకంగా నియమించిన బృందాల పనితీరును ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ కు వివరించారు. ఆ తర్వాత క్యాంటీన్, రిసెప్షన్, అతిధుల రూములలో పెట్టిన శానిటైజర్స్, మాస్కులను పర్యవేక్షించారు. ఇలాగే రాబోయే రోజులలో కూడా తగిన శ్రద్ధతో శుభ్రం చేయాలనీ, కరోనా వైరస్ ఆనవాళ్లు ఏపీ భవన్ దరిదాపుల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.