ఆంధ్రప్రదేశ్ బీజీపీ అధ్యక్షునిగా ఎవరు?

ఆంధ్రప్రదేశ్ బీజీపీ అధ్యక్షునిగా ఎవరు?

TS, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు వస్తారు.
ఈ విషయం మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజీపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు చెప్పినమాట. ఆయన చెప్పినట్లే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వచ్చారు. మరి ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడి మాటేమిటి? కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతారా? లేదా? ఇదే ఇప్పుడు ఏపీ కమలం పార్టీ నేతల్లో హాట్ టాపిక్.
కన్నా లక్ష్మీనారాయణను మార్చడం అనేది చాలా రోజులుగా పార్టీలో చర్చనీయాంశంగానే ఉంది. అయితే ఆయన స్థానంలో ఎవరు వస్తారు? అసలు సమర్థులు ఉన్నారా? కులాలపోరు ఎక్కువగా ఉండే ఆంధ్రాలో ఏ వర్గానికి ఆ పదవి ఇస్తారోనని
చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కమలంతో కలియ తిరుగుతున్నారు కాబట్టి కాపు వర్గ నాయకుడైన కన్నా లక్ష్మీ నారాయణనే కొనసాగిస్తారా? ఖచ్చితంగా కొనసాగుతారని ఓ వర్గం చెబుతుంటే మరోవైపు మార్పు తప్పదు అధిష్టానం యువ నేతలకు ఆ పదవి ఇస్తుందని
టాక్ నడుస్తోంది. అసలు బిజెపి అధిష్టానం ఇప్పటి వరకు ఓ సరైన అభ్యర్థిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకునే విషయంలో
రాష్ట్ర బీజేపీ నేతల నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో మరికొద్ది రోజుల్లో ఈ గందరగోళం నెలకొంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి, కమ్మ కులాలు రెండు పెద్ద పార్టీలను ‘ఓన్’ చేసుకున్న సమయంలో మరో ప్రధాన
కులం ‘కాపు’ను చేరదీసేందుకు భాజపా కన్నా లక్ష్మీనారాయణకు గతంలో అధ్యక్ష పదవి ఇచ్చింది.
ఇప్పుడేమో కాపు ఓటు బ్యాంకును తమవైపు ఆకర్షించడానికి ఏకంగా పవన్ కల్యాణే తమ అమ్ముల పొదిలో ఉండటంతో
కమలం అధిష్టానం మరో వర్గంపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. అంకబాబు, సీనియర్ ఎనలిస్టు అభిప్రాయం ప్రకారం అధ్యక్షుడిని మార్చాలనుకుంటే మాధవ్, సోము వీర్రాజు, పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు వినబడుతున్నాయి.