రైతుల సమస్యలపై ఏపీ బీజేపీ గళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ గౌరవనీయులైన బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన ఏపీ బీజేపీ సభ్యుల బృందం. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, విజయవాడ లోక్ సభ బిజెపి కార్యదర్శి కిలారు దిలీప్ తదితరులు హాజరయ్యారు.

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ
దేశంలో సిటిజన్ ఎమెండ్ మెంట్ యాక్ట్ పార్లమెంట్ లోని ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభ లో చర్చించి చట్టం చేయబడింది. కాని కాంగ్రెస్, కమ్యునిష్టులు, ఎంఐఎం ముస్లింలను మత పరంగా రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర పన్నుతున్నారు. సిఎఎ వలన ఎవరికి నష్టం లేదని ప్రధాని మోడీ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు మోడీని ధైర్యంగా ఎదుర్కోనే ధమ్మూ, ధైర్యం లేక మత విధ్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. దేశంలో అల్లకల్లోలాలు సృష్టించాలని కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూమిష్టులు ప్రయత్నిస్తున్నారు. మత విధ్వేషాలు రెచ్చగొడుతున్న ఓవైసిని దేశంలో పర్యటించకుండా ఆంక్షలు విధించాలని కన్నా కోరుతున్నానన్నారు.