AP సీఎం జగన్ ఏమి చేశారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ కోవిడ్-19 నివారణ చర్యలపై తాడేపల్లిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రజలు అందరూ ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం మరవరాదని తప్పనిసరిగా మాస్క్ వాడాలని విజ్ఞప్తి చేసారు.

APలో 18.04.2020 ఒక్క రోజే కరోనా టెస్టులు 5400 మందికి చేశామన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి 10లక్షల మందికి అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో 2వ స్థానానికి AP చేరుకున్నది. రాజస్థాన్ 685 చేస్తుండగా, 539 పరీక్షలతో రెండో స్థానంలో ఏపీ ర్యాపిడ్‌ కిట్స్‌ వినియోగించకుండానే ఈ స్థాయికి చేరింది. మరో 3–4 రోజుల్లో మరిన్ని టెస్టులు చేసే సంఖ్య బాగా పెరుగుతుందన్న అధికారులు అంటున్నారు. రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు కుటుంబ సర్వేలద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షలు కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై CM జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, వీరితోపాటు ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారిని చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలన్న సీఎం రాష్ట్రంలో ప్రతి 2–3 రోజులకు ఓసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని తర్వాత ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా వ్యవస్థను తయారుచేయాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారుచేసిన మాస్కులను పరిశీలించిన CM జగన్ రెడ్‌ జోన్లకు ముందస్తుగా పంపిణీ చేస్తున్నామన్నారు.