AP CM 24/7 కరోనా కసరత్తు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్‌-19 వైరస్ అరికట్టమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నివారణ చర్యలపై 24/7 కసరత్తు చేస్తున్నారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

APలో క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న వ్యక్తులకు ఒక్కొక్కరికి
₹2 వేలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఇంటికి వెళ్లాక కూడా పౌష్టికాహారం కోసం ఆర్థిక సహాయం తోడ్పడుతుందని, క్వారంటైన్‌ సమయంలో రోజుకు ₹600ల వరకూ ఒక్కో మనిషిపై ఖర్చు అలాగే రాకపోకలకు ఛార్జీల కోసం
మరో ₹600లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు.

ఈ అత్యున్నత సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం
కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలన్నారు. క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టిపెట్టడం, మాస్క్‌ల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. తొలి హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మాస్క్‌లను పంపిణీ, ప్రతి మనిషికి మూడు మాస్క్‌లు, వెంటనే డెలివరీ ప్రారంభిస్తామన్నారు అధికారులు.
రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, అలాగే మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో పెట్టాలి. రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేలా చూసుకోవలని, కియోస్క్‌లను ఏర్పాటు చేసుకోవాలని చముఖ్యమంత్రి చెప్పారు. ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాలని, ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని,
వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సమీక్షించారు.