కరోనా కట్టడికి AP సీఎం ఆదేశాలు

కరోనా కట్టడికి ముఖ్యమంత్రి ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు వచ్చిన జిల్లాల్లో పరిస్ధితిని సమీక్షించమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఏపీ ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళనాని అన్నారు. కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం, అవగాహన కల్పిస్తున్నాము. ప్రజల సహకారంతోనే కరోనాను నియంత్రించగలం. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలి. ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఆరుగురు వ్యక్తుల ఆరోగ్య
పరిస్ధితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఏపీలో కరోనా వ్యాప్తి రెండోవ దశలో ఉంది ఈ వైరస్ మూడవ దశలోకి వెళ్ళకుండా నిరోధించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

నియోజకవర్గంకు ఓ వంద పడకల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నాం. 108 సిబ్బందికి అవసరమైన పరికరాలు, వస్తువులు అందించడంతోనే కాకుండా మనోధైర్యాన్ని కలిగించే చర్యలు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా వ్యాప్తి తక్కవగా ఉంది. ప్రజలు ఆందోళన చెందవద్దు అవగాహనతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించగలం. రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ నేపధ్యంలో ఎవరైనా నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.