ముస్లింలకు రంజాన్ మాసం విజ్ఞప్తి: AP CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రంజాన్ మాసంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ప్రపంచంలో, దేశంలో కరోనా విజృంభనలో ఈ వైరస్‌ మహామ్మారిని అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు రంజాన్‌ కూడా వచ్చింది. దయచేసి ముస్లింలు అందరూ ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

ఈ రంజాన్‌ మాసంలో ముస్లింలంతా కూడా సర్కారుకు సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని ముఖ్యమంత్రి కోరారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేసారు. ఇది మనసుకు అత్యంత కష్టమైన మాట అయినా సరే చెప్పక తప్పని పరిస్థితని ముఖ్యమంత్రి ముస్లిం మత పెద్దలతో స్పష్టం చేశారు.

APలో YSRCP ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కులాలు, మతాలు, రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు ఇవ్వగలుగుతున్నాం. కొత్త కొత్త పథకాలు కూడా అమలు చేశాం. రైతు భరోసా, అమ్మ ఒడి అలాగే పెన్షన్లు 2,250₹
వరకు తీసుకెళ్లాం. గత నెల రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు 150 కోట్లు రావాల్సిన ఆదాయంకు కరోనా కారణంగా బ్రేకులు పడిప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదని దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా అడుగులు వేస్తున్నాము. ప్రతి పేదకుటుంబానికీ
1000₹లు ఇచ్చాము. నెలకు 3సార్లు రేషన్‌ ఇస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పటికి 2 సార్లు రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా, వైద్యం కోసం, ఇతరత్రా అంశాల కోసం ఖర్చులు బాగా పెరిగినా ప్రజలకు ఇబ్బందులు రాకూడదని, కష్టాలు ఉన్నప్పటికీ అడుగులు ముందుకేస్తున్నాం.

పొదుపు సంఘాల్లోని మహిళలు అందరికీ 24వ తేదీన సున్నా వడ్డీ కార్యక్రమానికి 1400₹ కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాము. ప్రతి పేదవాడికీ చదువులు చెప్పించే కార్యక్రమంలో భాగంగా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కోసం ఈనెలలోనే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం పెట్టిన రూ.1800 కోట్లు చెల్లించాము.

ఈ ఏడాది మార్చి 31వరకూ ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లి అక్కౌంట్లోకి నేరుగా చెల్లిస్తాం. కష్టాల్లో ఉన్నా కూడా చేయాల్సిన పథకాల విషయంలో AP సర్కారు ముందడుగు వేస్తోంది.

కరోనా మహామ్మారిలాంటి ఇబ్బందికర సమయాల్లో కూడా గతం నుంచి ఇస్తోన్న ప్రతి మసీదుకు సంబంధించి రంజాన్‌ నాటిని పూర్తి బకాయిలు చెల్లిస్తాము. మిగిలిన జాబితాలో లేని మసీదుల కూడా 5₹ వేల రూపాయలు గ్రామ వాలంటీర్‌ ద్వారా చెల్లిస్తాము. అలాగే ప్రతి చర్చికీ 5₹ వేలు చెల్లిస్తాము. అంతే కాకుండా ప్రతి దేవాలయంకు 5₹ వేలు ఇవ్వమని ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ తెలిపారు.

ఈ సర్కారు అందరిది, మన అందరిది, ముస్లింలు అందరూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునేలా మీరు అందరూ సందేశం ఇస్తారని హామీ ఇస్తున్నందుకు మీకు పేరు పేరునా CMగా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం జగన్ అన్నారు.