కోవిడ్‌-19 నివారణపై సమీక్ష

కోవిడ్‌ నివారణా చర్యలపై సీఎం YS జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని, కరోనా లక్షణాలతో ఎవరు వచ్చినా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు వీలైనంత వేగంగా పూర్తిచేయాలని, ప్రతి జిల్లాలో కూడా ఓ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు, ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే జరుగుతుండాలని సమీక్షలు జరిపారు. ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం ఇవ్వబోతోన్న మార్గ దర్శకాల ఆధారంగా చర్యలు తీసుకోవడంపై అధికారులు సమాయత్తంగా ఉండాలన్నారు.
ఈ సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.