ప్రధానితో లాక్ డౌన్/ ఆర్థిక అంశాలు చర్చ

దేశంలో కరోనా వైరస్‌ నివారణా చర్యలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం YS జగన్, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌పై ప్రధానితో తన అభిప్రాయాలను పంచుకున్న సీఎం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నాము రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నాము. ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. అలాగే కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం, క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నాం, 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసిన విషయాలను తెలిపారు. జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు, సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌సెంటర్లను ఏర్పాటుచేసుకున్నాం, ఇందులో 26వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి.

రాష్ట్రంపై లాక్‌డౌన్‌ ప్రభావానికి సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక, జీఎస్‌డీపీలో 35% ఉపాథికల్పనలో 62% వాటా వ్యవసాయానిదే అందుకే లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది. రోడ్లపై వాహనాలను నిలిపేస్తారని భయంతో 25% మించి ట్రక్కులు తిరగడంలేదు,
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు. మార్కెట్లు నడవక పోవడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు.

కాని స్థానికంగా వీటిని ఎంతవరకు వినియోగించగలం? ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయంలేక, ఎగుమతులు లేక ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది, ఇక రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే 1,03,986 యూనిట్లకు గానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయి, పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది, రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడంకూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యింది, పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం? రాష్ట్రానికి కనీస ఆదాయం కూడా రాని పరిస్థితి, సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తింది ఆదుకోవాలి. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు, కోవిడ్‌–19 నివారణకు ప్రధాని మంత్రిగా మీరు తీసుకున్న విశాలపరమైన, గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది నా అభిప్రాయం, ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలన్నది నా అభిప్రాయం.

1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది, రెండేళ్లకుపైగా అది దేశంపై ప్రభావం చూపింది, మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటే… దీర్ఘకాలంలో మనం పోరాటంచేయాల్సి ఉంటుంది, ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న వివరాలను, సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్ని దాన్ని విశ్లేషించి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను, 676 మండలాలు మా రాష్ట్రంలో ఉన్నాయి, కరోనా వైరస్‌ సోకిన మండలాల్లో 37 రెడ్‌జోన్‌లో ఉన్నాయి, ఆరెంజ్‌ జోన్లో 44 మండలాలు ఉన్నాయి, 676 మండలాల్లో 81 మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి, 595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు. రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలన్నది నా అభిప్రాయం, జనం గుమిగూడ కుండా మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నది నా అభిప్రాయం, ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలన్నది నా అభిప్రాయం, కరోనా వైరస్‌ మరింత వ్యాపించకుండా దేవుడి దయవల్ల అడ్డుకోగలుగుతున్నాం. మన కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నాం, నా అభిప్రాయంతో పాటు,
మా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై మీకు సంక్షిప్తంగా నివేదించాను, ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా ఉండాలి, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలి, మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది, ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుతామని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయబడ్డారు.