ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో CM YS జగన్‌

కోవిడ్‌19ను ఎదర్కోవడంలో రాష్ట్రంలో సమగ్ర విధానానలు అనుసరిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో 2012 నాన్‌ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులను నెలకొల్పాము. 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కోవిడ్‌ –19 వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించాం.10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్‌ ఈ ఆస్పత్రుల్లో సిద్ధం చేశాం. మొత్తంగా 1000 ఐసీయూ బెడ్లను సిద్ధంచేశాం. దీనికి తోడుగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్‌ కోసం యరో 20వేల బెడ్లను రెడీగా ఉంచాం. అంతేకాక క్షేత్రస్థాయిలో నిరంతరం గట్టి పర్యవేక్షణ చేస్తున్నాం. ఫిబ్రవరి 10, 2020 నుంచి ఇప్పటివరకూ 27,876 మందికిపైగా విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చారు. వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మందికాగా 17,336 మంది రూరల్‌ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరిని తరచుగా కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగిన వారు, వీరి కుటుంబ సభ్యులు అంటే మొత్తంగా ప్రైమరీ కాంటాక్ట్స్‌ 80,896 మంది ఉన్నారు. వీరందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఉన్నారు. కోవిడ్‌ –19 లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే చేశాం:
గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికి రెండు సర్వే చేశాం. ఢిల్లీలో తబ్లీగీ సమాతే సదస్సుకు హాజరైన వారిని గుర్తించి వారి క్వారంటైన్‌కు తరలించాం.
వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించండం, మంచి వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. తబ్లిగీ జమాతేకు హాజరైన 1085 మంది ఇలా గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయిస్తున్నాం.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 132 మందికి కోవిడ్‌ –19 సోకింది. ఇందులో 111 మంది తబ్లీగ్‌ జమాతేకు వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్‌ అయినవారే. 91 మంది తబ్లీగ్‌జమాతేకు వెళ్తే, మరో 20 మందికి కాంటాక్ట్‌ కావడంద్వారా ఈ వైరస్‌ సోకింది. క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ స్ట్రాటజీని పాటిస్తున్నాం. వైద్య పరంగా ఇప్పుడున్న యంత్రాంగాన్ని, పరికరాలను పూర్తిస్థాయిలో మోహరిస్తున్నాం:
అయితే మరిన్ని పరీక్షలు నిర్వహించడానికి టెస్టు కిట్లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ మరిన్ని కావాల్సిన అవసరం ఉంది. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలురకాల చర్యలను తీసుకుంది. పేదకుటుంబాలను ఆదుకోవడానికి అనేకచర్యలను తీసుకుంది. మార్చి 29 నుంచే ఏప్రిల్‌ నెలకు ఇవ్వాల్సిన రేషన్‌ ఇప్పటికే ఉచితంగా పంపిణీచేయడంతోపాటు, కేజీ కందిపప్పును ఉచితంగా ఇచ్చాం. ఒకే నెలలో మొత్తం 3 సార్లు రేషన్, కందిపప్పును ఉచితంగా పేదకుటుంబాలకు అందిస్తున్నాం. పేద కుటుంబాలను ఆదుకోవడానికి, నిత్యావసరాల కొనుగోలుకోసం ప్రతి కుటుంబానికి రూ. 1000లు కూడా ఏప్రిల్‌ 4వ తేదీన ఇవ్వబోతున్నాం. అంతేకాక ప్రభుత్వం రైతు బజార్లను వికేంద్రీకరించింది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగకుండా వాటిపై ప్రత్యేక కమిటీల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రతి మార్కెట్‌ దుకాణాల వద్ద ప్రకటించిన ధరల పట్టికను ప్రదర్శిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 9,695 మందికోసం 218 సహాయ పునరావాస శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఇందులో ఏపీకి చెందిన వారు 3,819 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 5,876 మంది ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఈనెలలో ఇవ్వాల్సిన జీతాల్లో యాభైశాతం వాయిదా వేశాం. ఆదాయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం అనుకోకుండా ఖర్చులు పెరిగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మంత్రిగారిని కోరుతున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.