జల వివాదంపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు

జల వివాదంపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య జల వివాదాలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదని చెప్పారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అని ప్రశ్నించారు. నీటి అంశంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణ విద్యుదుత్పత్తి విషయంపై మరోసారి లేఖ రాయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీకి లేఖ రాయాలని జగన్‌ స్పష్టం చేశారు.