ఢిల్లీలో జర్నలిస్టుల పరిస్థితులపై AP సీఎం ఆందోళన

ఢిల్లీలో తెలుగు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు అవసరమైన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలుగు జర్నలిస్టులకు టెస్టులు చేయించాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ సిబ్బందితో ఏపీ ప్రభుత్వ అధికారులు మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో అవసరమైతే పరీక్షల నిమిత్తం ప్రత్యేక శిబిరం కూడా పెడతామంటున్న అపోలో హాస్పిటల్ వైద్య బృందం, ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠి, రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేన, స్పెషల్ కమిషనర్ రమణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.