AP సోషల్ మీడియాలో ప్రచారం

APలో కోవిడ్‌–19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలపై సమగ్ర సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు ఉద్దేశించిన వాట్సప్, ఫేస్‌ బుక్‌ మెసెంజర్‌ చాట్‌ బోట్‌లను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి YS జగన్‌ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీఎస్‌ నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్, ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరయ్యారు.