తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ గవర్నర్, ముఖ్యమంత్రి 

తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ గవర్నర్, ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకే దసరా అని జగన్ పేర్కొన్నారు. చెడు ఎంత బలమైనది అయినా అంతిమ విజయం మాత్రం మంచిదేనని ఈ పండుగ చెబుతోందన్నారు.దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలకు మంచి జరగాలని, విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నట్టు జగన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ పండుగను జరుపుకోవాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంచన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.