ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా వైద్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కోవిడ్ 19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. కరోనాకు సంబంధించి కొత్తగా 15రకాల ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ ప్యాకేజీలోకి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. కరోనా అనుమానం, వ్యాధి నిర్దారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజి నిర్దారణ చేసింది. కనీసం 16వేల నుంచి గరిష్టంగా 2లక్షల 15వేలు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లో చేర్చుకోవడం, ట్రీట్మెంట్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆదేశాలకు ఇక్కడ క్లిక్ చేయండి.