ఈసీ గవర్నర్ తో ఐతే ఏపీ సర్కారు సుప్రీంకోర్టు లో…

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం. త్వరలో పిటీషన్ విచారణకు రానుంది.

ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం.

ఏపీ ప్రభుత్వ పిటిషనులో ప్రధాన అంశాలు:
1. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు సరికాదు.
2. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి
వాయిదా వేయడం సుప్రీం తీర్పుకు విరుద్దం.
3. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
4. హై కోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా ?
5. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాలని పిటీషన్.

మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై గవర్నర్ ను కలిసి వివరణ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం SEC నిమ్మగడ్డ రమేష్. ఈ సమావేశం బందర్ రోడ్డులోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గవర్నరుతో చర్చించిన అంశాలను అధికారులతో వివరించారు. మరికాసేపట్లో పత్రికా ప్రకటన విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నామనే విషయాన్ని ప్రకటనలో తెలియజేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.