కరోనా పరీక్షల్లో AP No-2

ఏపీలో కోవిడ్‌19 పరీక్షలు వేగం పెరిగింది. ప్రతి 10లక్షల మందికి చేస్తున్న టెస్టుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది.

కరోనా పరీక్షలపై పూర్తిస్ధాయిలో దృష్టిసారించిన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 10 లక్షల జనాభాకు 625 టెస్టులు, రాజస్ధాన్‌లో 749, తమిళనాడులో 602 టెస్టులతో మూడో స్థానంలో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో మొదటి స్థానంలోకి వెళ్తామని AP అధికారులు అంటున్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణలో టెస్టులు కీలకం అవడంతో ఈ అంశంపై ఏపీ సర్కారు దృష్టి పెట్టింది.

కేవలం కరోనా కేసులు మొదలైనప్పటి నుంచీ ఏపీలో జరిగిన టెస్ట్‌ల వివరాలు పరిశీలిస్తే 3 వారాల్లో పరీక్ష సామర్థ్యాన్ని ఏపీ గణనీయంగా పెంచుకున్నది. పూర్తి వివరాలు కింద పట్టికలో ఉన్నాయి.