AP వలస కార్మికులు సురక్షితంగా సొంత గూటికి

మహారాష్ట్రలో చిక్కుకున్న ఏపీ వలస కార్మికుల కోసం CM YS జగన్ ప్రభుత్వం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ముంబై నుండి వలస కార్మికులతో బయల్దేరిన శ్రామిక్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లు రైల్వే స్టేషన్ చేరుకుంది. సుమారు 1100మంది వలస కూలీలు ఈప్రత్యేక రైలులో వచ్చారు. కార్మికులకు అధికారులు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించనున్నారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన సీఎం వైఎస్‌. జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.