APలో మృత్యుంజయులు 34.30% నమోదు

AP రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,782 సాంపిల్స్ పరీక్షించగా 60 మంది కోవిడ్19 పాజిటివ్ ఉన్నారని నిర్దారింపబడ్డారు.రాష్ట్రంలోని నమోదైన మొత్తం 1777 పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1012 మందున్నారు. ఐతే ఏపీలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారంకిందట 22శాతం ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 34.30శాతానికి పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్జార్జ్ అయ్యారని తెలిపింది. ఏపీలో ఇప్పటి వరకు 589మందిని డిశ్జార్డ్ చేసినట్లు అథికారులు వెల్లడించారు.