APలో అంతర్జాతీయస్థాయి శిక్షణ. CM జగన్మోహన్

రాష్ట్రంలోని స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ యూనివర్శిటీ, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్య కేంద్ర ఏర్పాటుపై
సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. భవనాల నిర్మాణం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు.

ఐటీఐ, డిప్లమో, ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు పూర్తిచేసినవారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి, ఇప్పటికే ఆ తరహా కోర్సులు చేస్తున్నవారికి ఏడాది అప్రెంటిస్‌ ఇవ్వడమే ఈ యూనివర్శిటీ, నైపుణ్యకేంద్రాల ప్రధాన ఉద్దేశాలని స్పష్టంచేసారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధిచేయడం, శిక్షణ ఇవ్వడం, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి.

ప్రతి నైపుణ్య కేంద్రంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ది చేయడంతోపాటు జీవనోపాథి కోసం ఇతరులకు చిన్న చిన్న పనులు నేర్పించడానికి శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. ఎన్‌ఐసీ ద్వారా ఈ కార్యక్రమాలు, ఒక్కో ఫ్యాకల్టీలో ప్రముఖ సంస్థల భాగస్వామ్యాలు, దీనివల్ల ఈకోర్సులకు మరింత విలువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య రంగంలో సర్వీసులకుకూడా ఈనైపుణ్య కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు.

హైఎండ్‌ స్కిల్స్‌ కోసం విశాఖలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని,
ఏ కోర్సుకైనా కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలని, ఇప్పటివరకూ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌ లాంటి వివిధ కోర్సులు చదువుతున్న వారే కాదు, కోర్సులు పూర్తైన వారు కూడా ఈ కేంద్రాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అలాగే అధ్యాపకులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు శిక్షణా తరగతులు కూడా నైపుణ్య కేంద్రాల్లో నిర్వహించాలని ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గౌతంరెడ్డి ఇతర అధికారులు తెలిపారు.