ఎపి స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్

ఎపి స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్ కు రెండు కేటగిరీల్లో 10 మంది సభ్యుల నియామకం చేసారు. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన జీఓ 154 జారీ చేసిన ప్రభుత్వం. దీనిపై న్యాయస్థానంకు వెళ్ళిన పాత కౌన్సిల్ సభ్యులు. ఈ ఏడాది మార్చి 13తో ముగిసిన పాత కౌన్సిల్ పదవీకాలం. దీంతో జీఓ 154 ద్వారా నామినేట్ అయిన కొత్త సభ్యులు 14.3.2020 నుంచి కౌన్సిల్ లో అధికారికంగా సభ్యులుగా కొనసాగుతారని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సామాజిక సంస్ధల నుంచి నామినేట్ చేసిన సభ్యుల పర్యవేక్షణతో ఉపాధి హామీ పధకం మరింత పారదర్శకంగా, సమర్ధంగా నిర్వహించే వీలు కలుగుతుంది. ఎపిఎస్ఇసి కేటగిరీ-2 సభ్యులుగా ముత్తంశెట్టి విశ్వనాధ్, వేమనాధ్ రెడ్డి, ఎం పుల్లారెడ్డి, లంకిరెడ్డి మనోహర్ రెడ్డి, పి రామ సుప్రజ ఉన్నారు. కేటగిరీ-3 కింద టి.లక్ష్మీ నరసింహులు, గొల్ల కిషోర్ కుమార్, డి.వెంకట్రావు, బి.యమున, కె.మరియమ్మ నియామకం అయ్యారు.