స్థానిక ఎన్నికలపై ఈసీ వెర్సస్ సర్కారు

స్థానిక ఎన్నికలపై ఈసీ వెర్సస్ సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి APఎన్నికల కమిషనర్ కు లేఖ రాసారు. స్థానిక సంస్థలు వాయిదా వేస్తూ ఇచ్చిన ప్రకటన రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని అన్ని నియంత్రణ చర్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటుండటంతో ఎన్నికలు యధాతథంగా నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి లేఖలో కోరారు. మరో మూడు నాలుగు వారాల పాటు కరోనా అదుపులోనే ఉంటుంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ కొనసాగలన్నారు.
ఆదివారం స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ సీఎస్ కు లేఖ ద్వారా AP ఈసీ రమేష్ కుమార్ సమాచారం ఇచ్చారు.
ఈసీ లేఖకు సమాధానం ఇస్తూ సీఎస్ నీలం మరో ప్రతి
లేఖను రాసారు. లేఖతో పాటు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇచ్చిన రిపోర్ట్ ను జత పరిచారు. ఇవాళ గవర్నర్ ను AP ఈసీ రమేష్ కుమార్ కలవనున్నారు.