సాక్షి మరియు అరబిందో ఆస్తుల కేసులో ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది . కేసుని కొట్టివేస్తూ అక్రమంగా ఆస్తులు అటాచ్లు చేశారని ఈడీని ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది .
కేసు కొట్టివేస్తూ ట్రిబ్యునల్ ఈడీని అడిగిన ప్రశ్నలు —
— ఎవరైనా 21 కోట్లు లాభం కోసం 29 కోట్లు పెట్టుబడులు పెడతారా ? అసలు మీరు చేసిన ఈ ఆరోపణని ఎలా సమర్ధించుకొంటారు ?
— జగన్ , సాయిరెడ్డి లు ఇన్వెస్టర్లని మోసం చేసి పెట్టుబడులు పెట్టించారని ఈడీ ఆరోపణ .. ఒకవేళ ఇదే ఆరోపణ నిజమనుకొంటే ఆ ఇన్వెస్టర్లు కేసులు పెట్టాలి కానీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీరు కేసు పెట్టటం ఏమిటి ?
కనీసం ఆ ఇన్వెస్టర్లు మేము మోసపోయామని మిమ్మల్ని సంప్రదించారా ?
— సాక్షిలో 60 మంది పెట్టుబడులు పెడితే కేవలం కొంతమందిని మాత్రమే కేసుల్లో ఎందుకు పెట్టారు ?
— అసలు కేసులతో సంభంధం లేని ఆస్తులని అటాచ్ చేయటం ఏమిటి ?
— సాక్షిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని కానీ లేదా నష్టపోయామని కానీ లేదా బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని కానీ మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా ?
ఇవీ ముఖ్యంగా ఈడీని ట్రిబ్యునల్ అడిగిన ప్రశ్నలు . వీటిలో ఏ ఒక్కదానికి ఈడీ సమాధానం చెప్పలేదు .
అసలు ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టినట్లు కనిపిస్తుందని , అసలు వీటిలో ఈడీ బాధ్యతారాహిత్యం కనిపిస్తుందని తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది .
ఇప్పుడు ఆనాడు సోనియా , చంద్రబాబు ఆదేశాలతో కట్టుకథలు అల్లి అడ్డదిడ్డంగా కేసులు పెట్టిన కేడీ లక్ష్మీనారాయణ బయటకి వచ్చి ట్రిబ్యునల్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి .
మిస్టర్ – స్కూల్ పిల్లలకి నీతులు తరువాత చెప్పొచ్చు ముందు ట్రిబ్యునల్ తీర్పు గురించి పచ్చ మీడియాకి సమాచారం ఇవ్వు .
ఏదిఏమైనా నిన్న తుదితీర్పు చదివితే తేలేదేమిటంటే అసలు జగనన్న మీద పెట్టిన ఏ కేసు నిలవదు , అన్నీ ఈ జేడీ పెట్టిన అక్రమకేసులే .