చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్​గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్​గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె

ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత త్రివిధ దళాల అధిపతులలో సీనియర్​గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు…సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. ఛైర్మన్​గా ఉంటారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించడం వల్ల.. ఈ హోదా ఖాళీగా ఉంది. సీడీఎస్ పదవిని సృష్టించక ముందు.. మూడు దళాల అధిపతుల్లో సీనియర్​గా ఉన్న వ్యక్తి ఛైర్మన్​గా వ్యవహరించేవారు.ఆర్మీతో పాటు వాయుసేన, నావికా దళాల అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్​లలో సీనియారిటీ ప్రకారం జనరల్ నరవణె ముందున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ఆయనకే అప్పగించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి సెప్టెంబర్ 30న వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా… నేవీ చీఫ్​గా అడ్మిరల్ ఆర్ హరి కుమార్.. నవంబర్ 30న పదవిలోకి వచ్చారు. జనరల్ నరవణె మాత్రం.. 2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్​గా కొనసాగుతున్నారు