షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో సహాయం

గత నెలరోజులనుండి GWAC చేస్తున్న నిర్విరామ కృషి ఫలితాలిస్తుంది. ఇండియన్ కాన్సులెట్ అధికారులు 120 మంది ఇండియన్ వర్కర్స్ (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్) కు షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో వసతి ఏర్పాటు చేసారు.

చెట్ల కింద, రోడ్డు పక్కన కాలం వెళ్లదీసస్తూ తిండికి అలమటిస్తున్న బాధితులు, మన భారతీయ కార్మిక సోదరులు (తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల సోదరులకు ఇప్పటి 50 మందికి 4 రూములు గత 20 రోజుల క్రింద ఇండియన్ కాన్సులెట్ సహకారంతో అందజేశారు

ఈరోజు BAPS హిందూ టెంపుల్ వారి సహకారంతో ఇండియన్ కాన్సులెట్ అధికారులు 10 రూములు 120 మంది సోదరులకు సరిపోయేలా వసతి, వాళ్లకు తినడానికి అన్ని రకాల నిత్యావసర సరుకులు, వంట చేసుకోవడానికి బగోనలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు GWAC అధ్యక్షులు కృష్ణ దొనికెన, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెండ్ల, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లేష్ గౌడ్ కోరెపు, సారంగుల నారాయణ, శ్రీకాంత్ దొనకంటి, షార్జా సిటీ ఇంచార్జ్ రమేష్ కుందారపు, షార్జా అర్బన్ ఇంచార్జ్ కిట్టు గంగపుత్ర ఉన్నారు. ఈ గొప్ప పనిని సమన్వయం చేస్తూ అహర్నిశలు కష్టపడుతున్న రవి కట్రోత్ ను GWAC అభినందిస్తుంది.