ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతోన్న టెస్టు సిరీస్ లో ఇరు జ‌ట్లు చెరో మ్యాచ్ గెలిచి స‌మ ఉజ్జీవులుగా ఉన్న విష‌యం తెలిసిందే. మూడో మ్యాచ్ డ్రా అవ్వ‌డంతో ఇరు జ‌ట్లు 1-1తో నిలిచాయి. నిర్ణ‌యాత్మ‌క నాలుగో టెస్టులో గెలుపు కోసం పోరాడుతున్నాయి. బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరుగుతున్న భార‌త్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో ఆతిథ్య జ‌ట్టు బ్యాటింగ్ కొన‌సాగిస్తోంది.లబుషేన్ దూకుడుగా ఆడుతూ సెంచ‌రీ చేశాడు. డేవిడ్ వార్న‌ర్ 1, మార్క‌స్ హార్రిస్ 5, లబుషేన్ 108, స్టీవ్ స్మిత్ 36, మాథ్యూ 45 ప‌రుగులు చేశారు. ప్ర‌స్తుతం క్రీజులో కామెరాన్ 28, టిమ్ 38 ప‌రుగుల‌తో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 87 ఓవ‌ర్ల‌కు 274/5 గా ఉంది.  భార‌త బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ కు త‌లో వికెట్ ద‌క్కాయి.