TS MSME కంపెనీకి ఆస్ట్రేలియా గుర్తింపు

ఆస్ట్రేలియన్ ప్రభుత్వపు హెల్త్ డిపార్ట్మెంట్ TGA ఇచ్చే GMP సర్టిఫికెట్ తెలంగాణలోని భువనగిరి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి రీచ్ ఇండియా ఫార్మా లిమిటెడ్ కి రావడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న MSME సెక్టార్ లో ఉన్నటువంటి ఏ ఫార్మా ఫార్ములేషన్ కంపెనీకి ఇంత వరకు ఈ సర్ట్ఫికేషన్ రాలేదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్యాంసుందర్ తెలియజేశారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా తమ సంస్థ ఆస్ట్రేలియా మరియు 50కి పైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చు అని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల తమ సంస్థ ఈ స్థితికి రాగలిగిందని ఇంకా ముందు రోజుల్లో మరింత అభివృద్ధిని సాధించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఫార్మా రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందడానికి తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.