ఈ నెల 27 నుంచి ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం

ఈ నెల 27 నుంచి ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం

ఐపీఎల్ సందడి ముగిసింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. రోహిత్ శర్మ మినహా ఆటగాళ్లందరూ ఆసీస్ కు నిన్న పయనమయ్యారు. మరోవైపు టెస్ట్ సిరీస్ కోసం 17 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది. ఇందులో ఐదుగురు యువ ఆటగాళ్లకు స్థానం కల్పించింది. దేశవాళీ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన విల్ పుకోవిస్కి అనే యువకుడు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 27 నుంచి ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. కరోనా మహమ్మారి పంజా విసిరిన తర్వాత ఇండియా ఆడుతున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం గమనార్హం.

ఆస్ట్రేలియా టెస్టు జట్టు ఇదే:

టిమ్ పైన్ (కెప్టెన్), జేమ్స్ ప్యాటిన్సన్, విల్ పుకోవిస్కి, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, సీన్ అబోట్, జో బర్న్స్, పాట్ కమ్మిన్స్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్ , మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్.