జగన్ కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు

జగన్ కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 72వ పడిలో అడుగుపెడుతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ సీనియర్ రాజకీయ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుడి ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అటు, చంద్రబాబు కూడా అంతే గౌరవంతో స్పందించారు. ‘థాంక్యూ వెరీ మచ్ జగన్ గారూ’ అంటూ బదులిచ్చారు.