రమ్యకృష్ణ రఫ్ ఆడించేస్తోంది…

అంధాదున్ తెలుగు వర్షన్ సినిమాలో మహిళ విలన్ పాత్ర కోసం ఎవరొస్తారో నటించేందుకు కానీ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ పాత్రలో నటించేందుకు రమ్యకృష్ణను సంప్రదించగా క్యారెక్టర్ ఓకే చేసినా రెమ్యునరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేసిందట రత్నాల రమ్యకృష్ణ. కన్నడ చిత్రం KGF చాప్టర్2లో ఈ లేటు వయస్సు సుందరి రమ్యకృష్ణను సంప్రదించగా భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ ఈ పాత్రను దక్కించుకుంది. బాహుబలి ప్రభావంతో రమ్యకృష్ణ రేంజ్ అమాంతం ఆకాశాన్ని అంటేసింది అందుకు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దాలని ఈ సీనియర్ ముద్దుగుమ్మ రమ్యకృష్ణ ఏమాత్రం డబ్బుల విషయంలో తగ్గకుండా రఫ్ ఆడించేస్తోంది.

తెలుగు రీమేకులో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పూజాలు కూడా పూర్తి చేసుకుంది. సినిమాలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నారు.