బాహుబలి విజ‌యంతో మ‌లుపుతిరిగిన ప్ర‌భాస్ కెరీర్‌..RRR

బాహుబలి విజ‌యంతో మ‌లుపుతిరిగిన ప్ర‌భాస్ కెరీర్‌..

హీరోల స్టార్‌డ‌మ్ పెంచుతున్న రాజ‌మౌళి(జ‌క్క‌న్న‌)
జ‌క్క‌న్న తదుప‌రి చిత్రంపైనే ఇప్పుడు అంద‌రి చూపు

-బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ ఏ సినిమా చేసినా కూడా వందల కోట్లు వసూళ్లను రాబడుతున్న విషయం తెల్సిందే. ఒక్కసారి జక్కన్న చేతిలో పడితే ఆ హీరోల స్టార్ డమ్‌ ఎక్కడికో వెళ్తుంది. బాలీవుడ్ హీరోలను మించి క్రేజ్ ను దక్కించుకుంటారు. ప్రస్తుతం జక్కన్న భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ లతో చేస్తున్న విషయం తెల్సిందే. చరణ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాని ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ కళ్యాణ్ రామ్ ల నిర్మాణంలో అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.


సినిమాపై ఆస‌క్తిక‌ర చ‌ర్చా:
– త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరిద్దరి పారితోషికం గురించి ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ రూ. 40 కోట్ల పారితోషికం అందుకోబోతుండగా త్రివిక్రమ్ రూ. 20 కోట్ల పారితోషికంను తీసుకుంటున్నాడట. అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కించుకున్న త్రివిక్రమ్ రూ.20 కోట్ల పారితోషికమే తీసుకుంటున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


పారితోషికాల‌పై ప్ర‌చారాలు:
-ఇక ఎన్టీఆర్ అభిమానులు పారితోషికం విషయంలో చాలా నిరుత్సాహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ సాహో చిత్రానికి రూ.75 కోట్ల వరకు తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో కాకున్నా ఎన్టీఆర్ రూ.50 నుంచి రూ. 60 కోట్ల పారితోషికం అయినా తీసుకోవాలి కదా అంటున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు కనుక రూ. 40 కోట్ల పారితోషికం చాలా తక్కువ అనే అభిప్రాయం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైన తర్వాత అయినా ఎన్టీఆర్ ఆ తదుపరి చిత్రంకు భారీ స్థాయిలో పారితోషికంను తీసుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నార‌ని తెలుస్తోంది..!.