సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌

సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌

సంగం డెయిరీ కేసులో నెల రోజుల క్రితం పోలీసులు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ, సహకారశాఖ మాజీ అధికారి గురునాథాన్ని అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు నరేంద్రతో పాటు గోపాల్‌కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు విజయవాడ మునిసిపల్ పరిధిలోనే ఉండాలని ష‌ర‌తు విధించింది. నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణ అధికారికి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, విచారణకు 24 గంటల ముందు విచారణ అధికారి నోటీసు ఇవ్వాలని సూచించింది. కాగా, ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు నేప‌థ్యంలో నాలుగు వారాలుగా వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత‌లు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇన్ని రోజులు రాజ‌మ‌హేంద్ర వ‌రం జైలులో ఉన్నారు. అందులోనే ఆయ‌న‌కు క‌రోనా పరీక్షలు చేయించ‌గా పాజిటివ్ అని తేలడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయ‌న‌ను విజయవాడలోని ఆయుష్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందేలా చేశారు.