గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తదుపరి సినిమా

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తదుపరి సినిమా

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు ‘గిఫ్ట్’ వచ్చేసింది. గోపీచంద్ మలిలేని దర్శకత్వంలో బాలయ్య ప్రధాన పాత్రలో 107వ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజా లుక్‌‌ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చనున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ‘హంట్ స్టార్ట్స్ సూన్’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియో దూసుకుపోతోంది. బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా ప్రాజెక్టు ప్రారంభం కానుంది.