బసవేశ్వర 887వ జయంతి వేడుకలు

మాహాత్ముడు వీరశైవ స్థాపకులు శ్రీ బసవేశ్వర 887వ జయంతి సందర్బంగా పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి మంత్రి హరీష్ రావు హాజరై నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కరోనా శాంపిల్ కలెక్షన్ బూతును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. శ్రీ
బసవేశ్వరుని అడుగు జాడల్లో TS రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, సంగారెడ్డి జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా ఐక్యమత్యంతో సాధ్యమైందన్నారు.

పోలీసులు మన రక్షణ కోసం కొడుతున్నారు, కుటుంబాన్నీ వదిలి పని చేస్తున్నారు కనీసం ప్రజలు ఆ విషయం గుర్తుంచుకుని ఇళ్లలోనే ఉండాలి. TRS పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్సకు గతంలో 200 ఔట్ పేషెంట్లలో ఇప్పుడు 35 మంది మాత్రమే ఉన్నారు..

తెలంగాణలో ఏడున్నర లక్షల వలసకూలీలను అదుకున్నాము, మరో 6 లక్షల మందికి పోస్ట్ ఆఫీస్ డబ్బులు ఇస్తూ, కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంది. ప్రజలు కరోనాపై కనీసం మరో 6 నెలలు నుంచి సంవత్సరం వరకు జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు హెచ్చరించారు.